పవన్ కళ్యాణ్ వల్ల ఇబ్బందుల్లో పడ్డ మెగా హీరో సాయి తేజ్

Sai Dharam Tej in trouble because of Pawan Kalyan
x

పవన్ కళ్యాణ్ వల్ల ఇబ్బందుల్లో పడ్డ మెగా హీరో సాయి తేజ్ 

Highlights

*పవన్ కళ్యాణ్ వల్ల ఇబ్బందుల్లో పడ్డ మెగా హీరో సాయి తేజ్

Sai Dharam Tej: బైక్ ఆక్సిడెంట్ తర్వాత మెగా హీరో సాయి తేజ్ చాలా కాలం సినిమాలకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు సాయి తేజ్. సుకుమార్ రైటింగ్స్ వారితో చేతులు కలిపిన సాయి తేజ్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనడం మొదలుపెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ తో సాయి తేజ్ ఒక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే.

తమిళంలో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రముఖ నటుడు మరియు డైరెక్టర్ అయిన సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముందుగా ఈ సినిమాని పూర్తి చేయాలని అనుకున్నారు. దీంతో సాయి తేజ్ తన సినిమా షూటింగ్ని హోల్డ్ లో పెట్టేసి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో పట్టాలెక్కల్సింది.

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలాగా కనిపించడం లేదు. ఒకవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉండగా, పవన్ కళ్యాణ్ రాజకీయ పనులతో తలకిందులు అవుతున్నారు. కనీసం దర్శక నిర్మాతలకు కూడా పవన్ కళ్యాణ్ డేట్ల గురించి క్లారిటీ లేదు. కానీ సాయి తేజ్ మాత్రం పవన్ కళ్యాణ్ కోసం తన సినిమాలను పక్కన పెట్టేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories