Sai Dharam Tej: త్వరలోనే డిశ్చార్జి కాబోతున్న సాయిధరమ్ తేజ్

* సాయిధరమ్ తేజ్ మూడు రోజుల క్రితమే వెంటిలేటర్ నుంచి తొలగించారు * రెండు మూడు రోజుల్లో తేజ్ ను డిశ్చార్జ్ చేయొచ్చు

admin1
Updated on: 23 Sept 2021 8:45 PM IST
Sai Dharam Tej Health Bulletin Released
X

సాయి ధరమ్ తేజ్ (ఫోటో- ది హన్స్ ఇండియా )

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యనే బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. ఇసుక వల్ల బైక్ స్కిడ్ అవడంతో తేజ్ జారిపడి గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు సాయి ధరంతేజ్ ను అపోలో హాస్పిటల్ లో చేర్పించారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. ఒకవైపు కొందరు మెగా హీరోలు సోషల్ మీడియాలో తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ మూడు రోజుల క్రితమే వెంటిలేటర్ నుంచి తొలగించారట.

అలాగే ఐసియు నుంచి ఇప్పుడు సాయి ధరంతేజ్ ని జనరల్ వార్డ్ కి మార్చారు. మరొక రెండు మూడు రోజుల్లో తేజ్ ను డిశ్చార్జ్ చేయొచ్చు అని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్న సాయి ధరమ్ తేజ్ తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. సాయి ధరంతేజ్ ను పలకరించటానికి ఇప్పటికే పలు టాలీవుడ్ సెలబ్రిటీలు అపోలో కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల పరంగా చూస్తే సాయి ధరమ్ తేజ్ తదుపరి సినిమా "రిపబ్లిక్" అక్టోబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది.

admin1

admin1

Next Story