Sai Dharam Tej: స్పీడ్ పెంచిన మెగా హీరో.. మాస్ డైరెక్టర్ తో తేజ్..

Sai Dharam Tej: త్వరలో నెక్స్ట్ సినిమా ప్రకటించబోతున్న మెగా హీరో

Jyothi
Updated on: 19 April 2023 6:30 PM IST
Sai Dharam Tej Has Signed Another Film
X

Sai Dharam Tej: అప్పుడే మరొక సినిమా సైన్ చేసిన సాయి ధరంతేజ్

Sai Dharam Tej: బైక్ ఆక్సిడెంట్ తర్వాత చాలా కాలం సినిమాలకి దూరంగా ఉన్న సాయి ధరంతేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఈ మెగా హీరో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటించిన "విరూపాక్ష" అనే సస్పెన్స్ థ్రిల్లర్ మరొక రెండు రోజుల్లో ఏప్రిల్ 21 న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం సాయి తేజ ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.

ఒకవైపు ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే సాయి తేజ్ తన నెక్స్ట్ సినిమాని అధికారికంగా ప్రకటించడానికి రెడీ అయిపోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం సాయి తేజ్ త్వరలోనే సంపత్ నంది దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథ బాగా నచ్చడంతో సాయి తేజ్ ఈ సినిమాకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టేలోపు సాయి తేజ్ తమిళ్లో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" తెలుగు రీమేక్ షూటింగ్ ను కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జులై 28వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు.

Jyothi

Jyothi

Next Story