పవన్ కళ్యాణ్ వద్దన్నారు కాబట్టే...

Ruthvik
Published on: 9 April 2019 5:53 PM IST
పవన్ కళ్యాణ్ వద్దన్నారు కాబట్టే...
X

ఏపీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాన్ కూడా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఏ మెగా హీరోలు వస్తారా అని చూస్తుండగా, కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. వరుణ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొన్నాడు. రామ్ చరణ్ కూడా ఇటీవలే పవన్ కళ్యాణ్ ను కలిసి, ఆయనకి ఒంట్లో బాగోకపోతే పరామర్శించి మద్దతు తెలిపాడు. ప్రస్తుతం అందరి కన్ను సాయి ధరమ్ తేజ్ పై పడింది. ఈ నేపథ్యంలో మెగా మేనల్లుడు క్లారిటీ ఇచ్చాడు. 'చిత్రలహరి' సినిమా విడుదల ముందు చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

అక్కడ మీడియా తో మాట్లాడుతూ జనసేన తరపున ప్రచారం చేయాలని తనకి ఉంది కాని మామయ్య ఒప్పుకోలేదు అని అన్నారు. "నేను ప్రచారం చేస్తానంటే ఆయన అనుమతిని ఇవ్వలేదు. సినిమాలు రాజకీయాలు రెండు చేయడం కరెక్ట్ కాదు అటో కాలు ఇటో కాలు వెయ్యొద్దు అని ఆయన అన్నారు. ఆయన మాట కాదని నేను ఏం చేయలేను. అందుకే జనసేన కోసం ప్రచారం చేయలేక పోతున్నాను" అని తేజ్ చెప్పుకొచ్చాడు. మరోవైపు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన 'చిత్రాలహరి' ఈనెల 12న విడుదల కానుంది. కాంపెయిన్ లలో కానరాకపోయినప్పటికీ, జనసేన కి ఓటెయ్యమని సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నాడు.

Ruthvik

Ruthvik

Next Story