అల్లు అర్జున్ తో గొడవ పై రియాక్ట్ అయిన మెగా మేనల్లుడు

Ruthvik
Published on: 24 April 2019 12:51 PM IST
అల్లు అర్జున్ తో గొడవ పై రియాక్ట్ అయిన మెగా మేనల్లుడు
X

గత కొన్ని సంవత్సరాలుగా వరుస డిజాస్టర్ లతో సతమతమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు 'చిత్రలహరి' అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఏప్రిల్ 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ ఫెయిల్యూర్స్ గురించి రియాక్ట్ అయ్యాడు. చాలామంది తన చుట్టూ ఉన్న వాళ్లు తనను తప్పుదోవ పట్టించడం వల్లనే తనకు తన సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి అని కొందరు అనుకుంటున్నారు అని కాని అందులో నిజం లేదని తను తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే తాను ఫెయిల్ అయ్యాను అని చెప్పుకొచ్చాడు తేజ్.

అంతేకాక వాళ్ళ తప్పు ఏమాత్రం లేనప్పటికీ తనతో సినిమాలు చేసి ఫ్లాప్ అందుకున్న దర్శకులు తనకు స్వయంగా సారీ చెప్పారని కూడా చెప్పాడు సాయి ధరమ్ తేజ్. ఇక అల్లు అర్జున్ కి తేజ్ సాయి ధరమ్ తేజ్ కి మధ్య గొడవలు ఉన్నాయి అని వస్తున్న పుకార్లపై కూడా సమాధానమిచ్చాడు తేజ్. తనకు బన్నీ కి మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు. "చరణ్ మరియు వరుణ్ తో నేను చాలా సమయం గడుపుతాను కానీ బన్నీని రెగ్యులర్ గా కలవను. కానీ ఎప్పుడు కలిసినా మేము చాలా బాగా మాట్లాడుకుంటాం. మేము ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. మా మధ్య శత్రుత్వం ఎందుకు ఉంటుంది." అని కూల్ గా పుకార్లను కొట్టి పారేశాడు సాయి ధరమ్ తేజ్.

Ruthvik

Ruthvik

Next Story