స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడిన సాయితేజ్

* నొప్పిగా ఉందంటూ స్పందించిన తేజ్ * సాయి తేజ్‌కు ఐసీయూలో కొనసాగుతున్న చికిత్స * రేపు సాయి ధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ

Sandeep Reddy
Published on: 11 Sept 2021 6:14 PM IST
Sai Dharam Tej Came to Consciousness And Takes Video Call With Family Members
X

స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej: రోడ్డు ప్రమాదానికి గురైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు స్పృహలోకి వచ్చాడు. వీడియో కాల్‌లో నిమిషం పాటు మాట్లాడిన సాయి ధరమ్ తేజ్ తనకు నొప్పిగా ఉందంటూ ఒకే ఒక్క మాట మాట్లాడాడు. మరోవైపు రేపు సాయి తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ చేయనున్నారు అపోలో వైద్యులు. ఉదయం నుంచీ తేజ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అపోలో వైద్యులు కాసేపటి క్రితం సాయి ధరమ్ తేజ్‌కు MRI స్కానింగ్ నిర్వహించారు. అనంతరం రేపు కాలర్ సర్జరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story