'సాహో' మేకర్స్ తో సాయి ధరమ్ తేజ్

Ruthvik
Published on: 2 May 2019 11:55 AM IST
సాహో మేకర్స్ తో సాయి ధరమ్ తేజ్
X

ప్రభాస్ 'మిర్చి' సినిమాతో నిర్మాణ సంస్థగా మారిన యు.వి.క్రియేషన్స్ బ్యానర్ చాలా తక్కువ సమయంలోనే లీడింగ్ బ్యానర్లలో ఒకటిగా మారింది. వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న యూవీ క్రియేషన్స్ హై బడ్జెట్ చిత్రాలను కూడా తెరకెక్కించింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'సాహో' సినిమాను నిర్మిస్తున్న యు.వి.క్రియేషన్స్ త్వరలోనే ఒక మెగా హీరో సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతోంది. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమైన యువ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యనే 'చిత్రలహరి' సినిమాతో మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

తాజాగా యు.వి.క్రియేషన్స్ వారు సాయి ధరంతేజ్ తదుపరి సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారట. సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని ముందుగా గీత ఆర్ట్స్ వారు నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పుడు యు.వి క్రియేషన్స్ వారు కూడా ఈ సినిమాకి సహనిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం మారుతి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. 'శైలజ రెడ్డి అల్లుడు' సినిమాతో డిజాస్టర్ అందుకున్న మారుతి ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాడు.

Ruthvik

Ruthvik

Next Story