పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న నితిన్

Sagar K Chandra is going to direct the Nithin
x

పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న నితిన్

Highlights

Nithin: యువ హీరో నితిన్ గత కొంతకాలంగా వరుసగా డిజాస్టర్ల లో ఉంటున్న సంగతి తెలిసిందే.

Nithin: యువ హీరో నితిన్ గత కొంతకాలంగా వరుసగా డిజాస్టర్ల లో ఉంటున్న సంగతి తెలిసిందే. 2021లో నితిన్ హీరోగా చెక్, రంగ్ దే, మరియు మేస్ట్రో సినిమాలు విడుదలయ్యాయి. కానీ అందులో ఒక్కటి కూడా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. ఇక తాజాగా నితిన్ తన తదుపరి సినిమా "మాచర్ల నియోజకవర్గం" పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత నితిన్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయడానికి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ మరెవరో కాదు సాగర్ కే చంద్ర.

"అయ్యారే" సినిమాతో డైరెక్టర్ గా మారిన సాగర్ కే చంద్ర అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన "భీమ్లా నాయక్" సినిమాకి దర్శకత్వం వహించి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తాజా సమాచారం ప్రకారం సాగర్ కే చంద్ర ఇప్పుడు నితిన్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన డిస్కషన్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 14 రీల్స్ బ్యానర్ వారు ఈ సినిమాని నిర్మిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories