Sacrificing star Sunisith arrested: సునిశిత్ అరెస్ట్‌

Sacrificing star Sunisith arrested: సాక్రిఫైజింగ్ స్టార్, ట్రెండింగ్ స్టార్ అంటూ సోష‌ల్ మీడియాలో ఇష్టానూసారంగా మాట్లాడూ.. వైరల్ అయిన సునిశిత్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Karampoori Rajesh
Published on: 23 July 2020 7:16 PM IST
Sacrificing star Sunisith arrested: సునిశిత్ అరెస్ట్‌
X
sacrificing star sunisith arrested

Sacrificing star Sunisith arrested: ‌సాక్రిఫైజింగ్ స్టార్, ట్రెండింగ్ స్టార్ అంటూ సోష‌ల్ మీడియాలో ఇష్టానూసారంగా మాట్లాడూ.. వైరల్ అయిన సునిశిత్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతగాడి హంగామా అంతా ఇంతా కాదు. తాను త్యాగం చేస్తేనే.. మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్‌ నటులకు సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయ‌నీ, బాహుబలి హీరో ముందు నేనే.. ఆర్ ఆర్ ఆర్ ఛాన్స్ నాకే.. అసలు మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్‌లు హీరోలే కాదు.. రాజమౌళి దర్శకుడే కాదు.. బాహుబలి సినిమా దగ్గర నుండి మహేష్ బాబు నేనొక్కడే వరకూ నేనే హీరో అంటూ, ఎన్నో సినిమాలకు డైలాగ్‌లు రాశానని, పాటలు పాడానని, మా అసోసియేషన్‌కి పనిచేశానని, యాంకర్‌ ప్రదీప్ తన స్టోరీని కొట్టేశాడని, రాజమౌళి, సుకుమార్ లాంటి స్టార్ దర్శకులకు నేను తప్ప వేరే దిక్కులేదంటూ ఒక్కటేమిటి, ఇలాంటివి నోటికొచ్చినట్టు మాట్లాడేశాడు.

ఇదిలా ఉంటే మ‌రోవైపు.. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నానని, ఆ తరువాత విడిపోయామని మాట్లాడాడు. ఈ వివాదంపై సునిశిత్‌పై లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు మరికొందరు కూడా సునిశిత్‌పై ఫిర్యాదు చేశారు. ఇక మిగిలిన హీరోయిన్లు కూడా తన లవర్లేనంటూ యూట్యూబ్‌లో తన వ్యాఖ్యలతో హల్‌చల్ చేశాడు. ఈ క్రమంలో ఇతగాడిపై రాచకొండ కమిషనరేట్‌లో రెండు కేసులు, ఇబ్రహీంపట్నం కీసరలో ఒక కేసు నమోదైంది. వాటిని విచారిస్తోన్న పోలీసులు తాజాగా సునిశిత్‌ని అదుపులోకి తీసుకున్నారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story