Allari Naresh New Movie: ఆకట్టుకుంటోన్న అల్లరి నరేష్ సభకు నమస్కారం ఫస్టు లుక్

Allari Naresh New Movie: హీరో అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Kranthi
Updated on: 30 Jun 2021 1:07 PM IST
Sabhaku Namaskaram is the Title for Allari Naresh new Movie
X

Allari Naresh New Movie First Look: (Twitter)

Allari Naresh New Movie: సభకు నమస్కారం అంటూ వచ్చేస్తున్నాడు మన హీరో అల్లరి నరేష్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అల్లరి నరేష్ ఒకప్పుడు వరుసగా కామెడీ సినిమాలతో అలరిస్తూ విజయాలను సొంత చేసుకునేవారు. అయితే ఇటీవల ఆయన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఆ మధ్య వచ్చిన నాంది సినిమా ఆయనకు పూర్వ వైభవాన్ని తెచ్చింది.

సభకు నమస్కారం అంటూ వైరటీ టైటిల్‌తో వస్తున్నారు నరేష్. దీనికి సంబంధించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మల్లంపాటి సతీష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చుతున్నారు. ఇక 'నాంది' తరువాత ఈ సినిమా వస్తుండడంతో మంచి అంచనాలున్నాయి. నరేష్‌కు కెరియర్ పరంగా ఇది ఆయనకు 58వ సినిమా అవుతుంది.

ఇక ఆయన నటించిన నాంది చిత్రం ఆయనకు పోయిన విశ్వాసాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో మంచి కథ కథనాలతో పాటు నరేష్ నటన ఓ రేంజ్‌లో ఉంటుంది. అల్లరి న‌రేష్ త‌న న‌ట‌న‌తో విమ‌ర్శకుల ప్రశంస‌లు అందుకున్నారు. నాందికి విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శక‌త్వం వ‌హించిన విషయం తెలిసిందే.


Kranthi

Kranthi

Next Story