ఓవర్సీస్లో కూడా మొదలైన సాహో హడావిడి

ఓవర్సీస్లో కూడా మొదలైన సాహో హడావిడి
x
Highlights

'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న మొదటి సినిమా 'సాహో' హిందీ, తెలుగు భాషల్లో విడుదలవనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే....

'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న మొదటి సినిమా 'సాహో' హిందీ, తెలుగు భాషల్లో విడుదలవనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మధ్యన విడుదలైన 'షేడ్స్ ఆఫ్ సాహో' చాప్టర్ 2 సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా టీ సిరీస్ బ్యానర్ 'సాహో' టీం కి అద్భుతమైన ఆఫర్ ఇచ్చిందని 'సాహో' తెలుగు, తమిళం, మలయాళం, హిందీ రైట్స్ కలిపి 200 కోట్లు ఆఫర్ చేసిందని ప్రచారం సాగింది.

ఇది ఒక ఎత్తు అయితే యూవీ క్రియేషన్స్ సంస్థ ఆ ఆఫర్ను రిజెక్ట్ చేసిందని 350 కోట్లు డిమాండ్ చేసిందని అనే వార్త మరొక ఎత్తు గా మారింది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ గురించి కూడా బోలెడు వార్తలు బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అమెరికా సహా విదేశాలకు సంబంధించిన హక్కులకోసం యు.వి.క్రియేషన్స్ 45 కోట్లు డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తం మళ్ళీ తిరిగి రాబట్టాలంటే 'సాహో' సినిమా బాహుబలి రేంజ్ లో వసూళ్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తారీఖున విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories