logo

రిలీజ్ కి ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న "సాహో".

రిలీజ్ కి ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సాహో.
Highlights

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'సాహో'. 'బాహుబలి' లాంటి భారీ బడ్జెట్ సినిమా తరువాత ఈ...

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా "సాహో". "బాహుబలి" లాంటి భారీ బడ్జెట్ సినిమా తరువాత ఈ సినిమాని కూడా హై బడ్జెట్ తో పూర్తి చేస్తున్నాడు ప్రభాస్. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే రిలీజ్ కి ముందే ఈ సినిమా రికార్డ్స్ సెట్ చెయ్యడం స్టార్ట్ చేసింది.

అవును ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్ ని ఫార్స్ అనే సంస్థ దాదాపు 42 కోట్లు పెట్టి కొన్నారు అంట. అసలు ఇండియా లోనే ఒక సౌత్ సినిమా కి ఈ రేంజ్ లో పెట్టడం ఇదే మొదటి సారి. సినిమా తెలుగు, హిందీ, తమిళ బాషల్లో తెరకెక్కుతుంది కాబట్టి తప్పకుండా సినిమా అంతకు మించి వసూలు చేస్తుంది అని ట్రేడ్ పండితుల అంచనా. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది ఆగస్ట్ 15 న "సాహో" సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.


లైవ్ టీవి


Share it
Top