'సాహో' పోస్టర్ కాపీ కొట్టారా

సాహో పోస్టర్ కాపీ కొట్టారా
x
Highlights

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'సాహో'. సుజిత్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల...

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'సాహో'. సుజిత్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మేకింగ్ వీడియోలు రెండూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు ప్రభాస్.

ఈ పోస్టర్ ద్వారా సినిమా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కాబోతుంది అనే విషయాన్ని స్పష్టం చేశారు దర్శక నిర్మాతలు.అయితే ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుతోంది. దానికి కారణం ఈ పోస్టర్ హాలీవుడ్ టీవీ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' పోస్టర్ లాగానే ఉండటం. 'సాహో' సినిమా పోస్టర్ ను 'బ్రేకింగ్ బాడ్' చూసి కాపీ కొట్టారని నెటిజన్లు దర్శక నిర్మాతల పై మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం ఎలా రియాక్ట్ అవుతుందో ఇంకా తెలియాల్సింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, మందిరా బేడి, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories