ఆకాష్ పూరి కోసం సాహో నటి

ఆకాష్ పూరి కోసం సాహో నటి
x
Highlights

పాపులర్ నటి మరియు టెలివిజన్ ప్రెసెంటర్ అయిన మందిరాబేడీ పేరు తెలియని వారు ఉండరు. ఈమె తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సాహో' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ...

పాపులర్ నటి మరియు టెలివిజన్ ప్రెసెంటర్ అయిన మందిరాబేడీ పేరు తెలియని వారు ఉండరు. ఈమె తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సాహో' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే తెలుగులో తన రెండవ సినిమా సైన్ చేసింది మందిరాబేడీ. తాజా సమాచారం ప్రకారం ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కనున్న 'రొమాంటిక్' అనే చిత్రంలో మందిరా ముఖ్య పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ఈ మధ్యనే 'మెహబూబా' అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు.

కానీ మొదటి సినిమాతోనే పరాజయం పాలయ్యాడు ఆకాష్. ఇక రెండవ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆకాష్ పూరి అనిల్ పాడూరి దర్శకత్వంలో ఈ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకు కథ, మాటలు పూరి జగన్నాధ్ అందించారు. ఈ సినిమాలో మందిరా బేడి పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమాలో మోడల్ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. మందిరాబేడీ కూడా ఈ షూటింగులో పాల్గోననుంది. పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories