Dhanush: "ఆర్ ఎక్స్ 100" దర్శకుడితో సినిమా చేయాలనుకుంటున్న ధనుష్

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న అజయ్ భూపతి

admin1
Updated on: 8 Oct 2021 5:34 PM IST
RX 100 Movie Director Ajay Bhupathi Planning to do the movie with Hero Dhanush
X
ధనుష్ తో సినిమా చేయనున్న అజయ్ భూపతి (ఫైల్ ఇమేజ్)

Dhanush : కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ధనుష్ తాజాగా తెలుగులో కూడా ఒక డైరెక్ట్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు ముందే మరికొందరు టాలీవుడ్ దర్శకులు సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు అజయ్ భూపతి. "ఆర్ఎక్స్ 100" వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి ఇప్పుడు ధనుష్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

ప్రస్తుతం అజయ్ భూపతి "మహా సముద్రం" సినిమాతో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ మరియు శర్వానంద్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ధనుష్ స్వయంగా అజయ్ భూపతి ని పిలిపించారట. "మహా సముద్రం" పోస్టర్లు బాగా నచ్చిన ధనుష్ అజయ్ భూపతి ని గోవా కి పిలిపించి ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగారట. దీంతో అజయ్ భూపతి కథ సిద్ధం చేయడంలో బిజీ అయిపోయారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

admin1

admin1

Next Story