'ఆర్ ఎక్స్ 100' దర్శకుడితో స్టార్ కపుల్

Ruthvik
Published on: 18 April 2019 9:14 AM IST
ఆర్ ఎక్స్ 100 దర్శకుడితో స్టార్ కపుల్
X

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడం అందరి దర్శకులకి కుదిరే పని కాదు. కానీ 'ఆర్ఎక్స్ 100' అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు అజయ్ భూపతి. ఈ సినిమా తరువాత తన తదుపరి సినిమా గురించి కొన్ని పుకార్లు బయటకు వచ్చాయి. ఒక దశలో అజయ్ భూపతి నితిన్ ను హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ దీని తాలూకు అధికారిక ప్రకటన వెలువడలేదు. తరువాత అజయ్ రెండవ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు అని వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఏమైందో తెలియదు కాని ఆ సినిమాలు పట్టాలెక్కలేదు.

తాజాగా అజయ్ భూపతి నాగచైతన్య తో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కోసం అనుకున్న కథ లోనే కొన్ని మార్పులు చేసి నాగచైతన్య ఇమేజ్ కు సరిపోయే లాగా అజయ్ దీన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. బెల్లంకొండ తో ఈ సినిమాను అనుకున్నప్పుడు సమంతను హీరోయిన్ గా తీసుకుందాం అని అనుకున్నాడు మరి ఇప్పుడు నాగచైతన్య కోసం కూడా సమంతానే తీసుకుంటారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కమర్షియల్ హీరోయిన్ గా నటించేందుకు సమంత ఆసక్తి చూపటంలేదు. మరోవైపు నాగ చైతన్య కి కూడా యాక్షన్ సినిమాలు రావటం లేదు. మరి ఇలాంటి సమయంలో ఈ స్టార్ కప్పుల్ ని అజయ్ భూపతి ఈ సినిమా కోసం ఒప్పిస్తాడా లేదా చూడాలి.

Ruthvik

Ruthvik

Next Story