RX 100 Director: ఫిమేల్ సెంట్రిక్ సినిమా తో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న అజయ్ భూపతి

RX 100 Director: ఫిమేల్ సెంట్రిక్ సినిమా తో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న అజయ్ భూపతి

Rama Rao
Published on: 13 Oct 2022 4:43 PM IST
RX 100 Director Ajay Bhupathi is Planning a Female Centric Film | Tollywood News
X

ఫిమేల్ సెంట్రిక్ సినిమా తో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న అజయ్ భూపతి

RX 100 Director: కార్తికేయ మరియు పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా నటించిన "ఆర్ఎక్స్ 100" సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే మంచి హీట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత సిద్ధార్థ మరియు శర్వానంద్ హీరోలుగా "మహాసముద్రం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన అజయ్ భూపతి ఆ సినిమాతో మాత్రం బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ ను అందుకున్నారు.

అయితే తాజాగా ఇప్పుడు మళ్లీ డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అజయ్ భూపతి. తాజా సమాచారం ప్రకారం అజయ్ భూపతి ఇప్పుడు తన తదుపరి సినిమాని మొదలుపెట్టే పనుల్లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఒక ప్రముఖ వ్యాపారవేత్త నిర్మాతగా అజయ్ భూపతి తదుపరి సినిమాకు వ్యవహరించనున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా అని తెలుస్తోంది.

అంతేకాకుండా ఒక ప్రముఖ లేడీ మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా మరియు స్క్రిప్ట్ కి సంబంధించిన విషయాలు త్వరలో తెలియనున్నాయి. అంతేకాకుండా తన ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అజయ్ భూపతి ఏ హీరోయిన్ ను రంగంలోకి దింపుతారో వేచి చూడాలి.

Rama Rao

Rama Rao

Next Story