Rumour: హీరోగా మారనున్న బండ్ల గణేష్?

Rumour: ప్రసిద్ధ హాస్యనటులలో ఒకరైన బండ్ల గణేష్.. నిర్మాతగా మారి 'గబ్బర్ సింగ్' తో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు.

Venkata Chari
Updated on: 28 April 2021 10:15 PM IST
Rumour: Bandla Ganesh to become the lead actor?
X

బండ్ల గణేష్ (ఫొటో ట్విట్టర్)

Rumour: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ హాస్యనటులలో ఒకరైన బండ్ల గణేష్.. నిర్మాతగా మారి 'గబ్బర్ సింగ్' చిత్రంతో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు.

అంనతరం రాజకీయాల్లోకి ప్రవేశించడంతో సోషల్ మీడియాలో కూడా సంచలనాలు సృష్టించారు. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' కార్యక్రమంలో ఆయన ఇటీవల చేసిన ప్రసంగం కూడా ఇంటర్నెట్‌ను తుఫానుగా మారింది.

తాజా నివేదికల ప్రకారం, బండ్ల గణేష్ ఇప్పుడు హీరో కావడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఒక తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారని, ఇందులో బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో చేస్తాడని వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు చర్చలు జరుపుతున్నారంట.

తమిళ చిత్రం 'మండేలా'కి ప్రేక్షకుల నుంచి, అలాగే విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. చాలా వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా రీమేక్ లోనే బండ్ల గణేష్ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story