RRR‌ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. రిలీజ్ డేట్ పై క్లారిటీ

Samba Siva Rao
Updated on: 25 Jan 2021 3:24 PM IST
RRR‌ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్.. రిలీజ్ డేట్ పై క్లారిటీ
X

ఆర్‌ఆర్‌ఆర్‌

రామ్‌చరణ్‌-ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం ('ఆర్‌ఆర్‌ఆర్‌'). ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర సమాచారం చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సినిమాయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్‌ కొమురంభీమ్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

డీవీవీ దానయ్య దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.'ఆర్‌ఆర్‌ఆర్‌'సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటుంది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను పంచుకుంది. గుర్రంపై రామ్‌చరణ్‌, బులెట్‌పై ఎన్టీఆర్‌లు దూసుకుపోతున్న పోస్టర్‌ అభిమానులను అలరిస్తోంది. పాన్‌ ఇండియన్‌ స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతుంది.

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియాభట్‌ రామ్ చరణ‌్ సరసన సీత పాత్రలో మెప్పించనున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌ సన్, బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలకపాత్రల్లో కనిపించనున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story