Top
logo

శీతాకాలం చలి .. పనులకు ఆపలేదు.. RRR వీడియో వైరల్!

శీతాకాలం చలి .. పనులకు ఆపలేదు.. RRR వీడియో వైరల్!
X
Highlights

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం త్రిబుల్ ఆర్.. బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం త్రిబుల్ ఆర్.. బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా.

అయితే లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్ తాజాగా మొదలై శేరవేగంగా జరుపుకుంటుంది. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను జకన్న ప్రస్తుతం తెరకేక్కిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. బీఏ రాజు ఈ వీడియోని షేర్ చేశారు. 'శీతాకాలం చలి పనులకు ఆపలేదు' అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియోలో దర్శకుడు రాజమౌళితో, కెమెరామెన్‌ సింథిల్‌తోపాటు చిత్ర యూనిట్‌ ఉన్నారు. చ‌లికి వ‌ణుకుతూ చిత్ర యూనిట్ షూటింగ్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఎన్టీఆర్‌కు రాజమౌళి షూట్‌ సీన్‌ను వివరిస్తున్నాడు. ఇక ఇప్పటికే సినిమా పోస్టర్ లతో సినిమా పైన అంచనాలను భారీ స్థాయిలో పెంచేసాడు రాజమౌళి.

ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తుండడం, బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తరవాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అజయ్ దేవగన్, శ్రియ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.Web TitleRRR video viral in social media
Next Story