RRR Pre Release Event: దుబాయ్ లో జరగబోతున్న "ఆర్ఆర్ఆర్" ఈవెంట్

RRR Event: దుబాయిలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్న "ఆర్ఆర్ఆర్" బృందం

admin1
Updated on: 28 Oct 2021 6:11 PM IST
RRR Unit Plans the Pre- Release Event in Dubai
X
ఆర్ఆర్ఆర్ ఈవెంట్ ను దుబాయిలో ప్లాన్ చేస్తున్న చిత్ర బృందం (ఫైల్ ఇమేజ్)

RRR Movie Pre Release Event in Dubai: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్యాన్ ఇండియన్ మల్టీస్టారర్ సినిమా "ఆర్ఆర్ఆర్". తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల కాబోతున్నట్టు ఈ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులతో బిజీగా ఉన్న మూవీ యూనిట్ త్వరలోనే ప్రమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీస్థాయిలో ప్లాన్ చేస్తున్నారట.

అయితే "ఆర్ఆర్ఆర్" ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ కాదు దుబాయ్ లో జరగబోతోందట. దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా లేనప్పటికీ వేడుక మాత్రం దుబాయ్ లోనే జరగబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. దీనికి సంబంధించిన పనులతో కూడా బిజీగా ఉంది చిత్రబృందం.

అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్న రామ్ చరణ్ బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ తో రొమాన్స్ చేయనుండగా, కొమరంభీమ్ పాత్రలో ఎన్టీఆర్ హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ తో రొమాన్స్ చేయనున్నారు. అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story