RRR Budget: బడ్జెట్ వివరాలు తెలియ చేసిన "ఆర్ఆర్ఆర్" బృందం

RRR Budget: వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇప్పుడు పెద్ద సినిమాలకు మాత్రమే టికెట్ రేట్లు పెంచగలిగే అవకాశాన్ని ఇచ్చారు...

Shireesha
Updated on: 19 March 2022 7:06 AM IST
RRR Team Sent Movie Budget Details to AP Government to Increase Ticket Price | Tollywood News
X

RRR Budget: బడ్జెట్ వివరాలు తెలియ చేసిన "ఆర్ఆర్ఆర్" బృందం

RRR Budget: నిన్నమొన్నటిదాకా సినిమా టికెట్లు పెంచే పంచడానికి ఏ మాత్రం ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇప్పుడు పెద్ద సినిమాలకు మాత్రమే టికెట్ రేట్లు పెంచగలిగే అవకాశాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో త్వరలో విడుదల కాబోతున్న పెద్ద సినిమాలు ముందుగా తమ బడ్జెట్ వివరాలను ప్రభుత్వానికి చూపించి ఆ తరువాతే టికెట్ రేటు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ఆర్ఆర్" సినిమా త్వరలో మార్చ్ 25 థియేటర్లలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం "ఆర్ఆర్ఆర్" బృందం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి తమ బడ్జెట్ కి సంబంధించిన వివరాలను పంపించినట్లు తెలుస్తోంది. అదే విధంగా తమ సినిమాకు టికెట్ రేట్ ను పెంచమని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్ర బడ్జెట్ను 336 కోట్లు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. అయితే దీంట్లో డైరెక్టర్ మరియు హీరోలు అందుకుంటున్న రెమ్యూనరేషన్ ను కలపలేదని సమాచారం. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సినిమా కి టికెట్ రేట్ పెంపు గురించిన పర్మిషన్ లు ఇవ్వనున్నట్లు సమాచారం.

Shireesha

Shireesha

Next Story