కొత్త షెడ్యూల్ కి సిద్ధమయిన 'ఆర్ ఆర్ ఆర్' బృందం

Ruthvik
Published on: 5 March 2019 6:03 PM IST
కొత్త షెడ్యూల్ కి సిద్ధమయిన ఆర్ ఆర్ ఆర్ బృందం
X

'బాహుబలి' సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మొట్టమొదటి సినిమా పైగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మొట్టమొదటి మల్టీస్టారర్ సినిమా కాబట్టి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి అండ్ టీం రాత్రింబవళ్లు కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం కోల్కతా లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరపనుందని తెలుస్తోంది.

ఈ షెడ్యూల్ 40 రోజులకు పైగా జరగనుందట. ఇద్దరు స్టార్ హీరోలు ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక సరికొత్త లుక్ తో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ల గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బోలెడు హీరోయిన్ల పేర్లు బయటకి వచ్చాయి కానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Ruthvik

Ruthvik

Next Story