RRR: మహేష్ బాబుతో "ఆర్ఆర్ఆర్" బృందం ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందా?

RRR: భారీ అంచనాల మధ్య "ఆర్ఆర్ఆర్" సినిమా మార్చి 25 న ఈ వారాంతంలో విడుదల కాబోతోంది...

admin1
Updated on: 23 March 2022 3:31 PM IST
RRR Team Interview with Mahesh Babu Cancelled | Tollywood News
X

RRR: మహేష్ బాబుతో "ఆర్ఆర్ఆర్" బృందం ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందా?

RRR: భారీ అంచనాల మధ్య "ఆర్ఆర్ఆర్" సినిమా మార్చి 25 న ఈ వారాంతంలో విడుదల కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాతో పాటే అభిమానులు కూడా సిద్ధంగా ఉన్నారు. మరో వైపు చిత్ర బృందం భారీ ఎత్తున ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి మాట్లాడుకుంటూ చిట్ చాట్ చేసుకుంటూ ఒక ఇంటర్వ్యూ విడుదలైంది. కీరవాణితో కలిసి ఇద్దరు హీరోలు మరొక ఇంటర్వ్యూ లో సందడి చేశారు.

మరోసారి "ఆర్ఆర్ఆర్" బృందంతో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేస్తూ కనిపించారు. అయితే నిన్న మొన్నటి దాకా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తారని అందరూ అనుకున్నారు. దీంతో సినిమాకి మరింత బజ్ క్రియేట్ అవుతుందని అభిమానులు కూడా అనుకున్నారు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ఇంటర్వ్యూ జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ చిత్ర ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నారు కానీ మహేష్ బాబు తో మాత్రం ఇంటర్వ్యూ అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story