ఆమె సినిమాలో గెస్ట్ రోల్ అయినా పర్లేదు అంటున్న మెగా పవర్ స్టార్..

Ram Charan: ఆ హీరోని చూడడానికి ఎదురుచూస్తున్నాను అంటున్న రామ్ చరణ్

Dhatripriya
Published on: 9 March 2023 2:32 PM IST
Guest Role For Mega Power Star Is Also Okay In That Movie
X

ఆమె సినిమాలో గెస్ట్ రోల్ అయినా పర్లేదు అంటున్నా మెగా పవర్ స్టార్

Ram Charan: "అర్ఆర్ఆర్" సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ నెల 12వ తేదీన తన కోస్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తో కలిసి ఆస్కార్ వేడుకకి హాజరవనున్నారు. ఈ సినిమా నుంచి "నాటు నాటు" పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో ఆస్కార్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఈ పాట ఆస్కార్ అవార్డును కూడా అందుకుంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ తాను చిన్నప్పటి నుంచి హాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగానని అన్నారు. అంతే కాకుండా మరొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హాలీవుడ్లో తన ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురవగా చెర్రీ ఆసక్తికరమైన జవాబు ఇచ్చాడు. మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఉంటే ఏ దేశంలోనైనా సినిమా చేయడానికి తను రెడీగా ఉన్నానని అన్నాడు రామ్ చరణ్. ఇప్పటికే కొన్ని టాక్స్ కూడా నడుస్తున్నాయని త్వరలోనే ఒక రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది అని తెలుస్తోంది.

టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగిన రామ్ చరణ్ ఇప్పుడు హాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్నారు అని అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ తనకి జూలియన్ రాబర్ట్ అంటే చాలా ఇష్టం అని ఆమె సినిమాలో గెస్ట్ రోల్ గా అయినా చేయడానికి తను సిద్ధమని అన్నారు. ఇక ఆస్కార్ ఈవెంట్ కి దాదాపు అందరూ హాలీవుడ్ నటులు హాజరవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఏ హాలీవుడ్ నటుడిని చూడడానికి చాలా ఎక్సైట్ అవుతున్నారు అని అడగగా రామ్ చరణ్ "హాలీవుడ్ నటులందరినీ చూస్తూ పెరిగాను. ఒక్కరు అని పేరు చెప్పలేను కానీ టామ్ క్రూజ్ మరియు కేట్ బ్లాంచెట్ లను చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను," అని అన్నారు రామ్ చరణ్.

Dhatripriya

Dhatripriya

Next Story