Rajamouli: 'ఆర్‌ఆర్‌ఆర్‌' నుంచి అజయ్ మోషన్ పోస్టర్ రిలీజ్

RRR Spl Suprise on Ajay Devgn Birthday
x
రాజమౌళి:(ఫైల్ ఇమేజ్)
Highlights

Rajamouli: అజయ్‌ దేవ్‌గణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఆయన పాత్రను తెలియజేసేలా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల.

Rajamouli: అజయ్‌ దేవ్‌గణ్‌ పుట్టినరోజు సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఆయన పాత్రను తెలియజేసేలా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. శుక్రవారం అజయ్‌ పుట్టినరోజు సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ ఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సినీప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. విజయదశమి పండుగను పురస్కరించుకుని అక్టోబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, హాలీవుడ్‌ తారలు ఎలిసన్‌ డ్యూడీ, రేయ్‌ స్టీవెన్‌సన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్, రామ్ చరణ్‌లుక్‌లతో సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలను పెంచిన రాజమౌళి తాజాగా అజయ్ లుక్‌‌తో పాటు విడుదలైన మోషన్ పోస్టర్‌తో అటు నార్త్‌లో కూడా అంచనాలను విపరీతంగా పెంచాడు. ఇక ఈ సినిమా కరోనా కారణంగా ఓ ఆరు నెలలు షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories