ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆగిపోయింది

Ruthvik
Published on: 7 April 2019 3:49 PM IST
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆగిపోయింది
X

మెగా పవర్స్టార్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పూణే లో జరుగుతుంది. చిత్ర వర్గాలు హైదరాబాద్ లో ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని మోడీ షెడ్యూల్ కోసం పూణే చేరుకున్నారు. వడోదర, మరియు పూణే పరిసర ప్రాంతాల్లో ని అడవుల్లో సినిమా షూటింగ్ చేద్దాం అని నిర్ణయించుకున్నారు. అయితే సినిమా కథ ప్రకారం కొంత భాగం నార్త్ ఇండియా లో జరగనుండం తో చిత్ర యూనిట్ పూణే కి బయల్దేరారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ పూణే షెడ్యూల్ వాయిదా పడింది. మూడు వారాల తర్వాతా నే సినిమా షూటింగ్ ముందుకు కదులుతుంది. రామ్ చరణ్ పూణే లో జిమ్ లో వార్ అవుట్స్ చేస్తూ ఉండగా తన మడమ కి దెబ్బ తగలడం వలన వైద్యులు మూడు వారాలు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని తేల్చి చెప్పడం తో చిత్ర యూనిట్ షూటింగ్ ని అత్యవసరం గా ఆపేసి హైదరాబాద్ కి తరలి రానుంది. ఇదే విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్ మీడియా లో తెలియజేసారు. రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు.

Ruthvik

Ruthvik

Next Story