RRR Pre Release Event: ప్రమోషన్స్ కోసం రంగంలోకి ముఖ్యమంత్రి !

RRR Pre Release Event: బాహుబలి సినిమా తో తెలుగు ఇండస్ట్రీని ఒకేసారి పది మెట్లు పైకి ఎక్కించిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" సినిమాతో బిజీగా ఉన్నారు.

Arun Chilukuri
Published on: 16 March 2022 3:59 PM IST
RRR Pre Release Event Will be Held on 19 March in Chikkaballapur
X

RRR Pre Release Event: ప్రమోషన్స్ కోసం రంగంలోకి ముఖ్యమంత్రి !

RRR Pre Release Event: బాహుబలి సినిమా తో తెలుగు ఇండస్ట్రీని ఒకేసారి పది మెట్లు పైకి ఎక్కించిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" సినిమాతో బిజీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 25న విడుదలకు సిద్ధమవుతోంది. అలియా భట్ మరియు ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ, సముతిరఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను భారీగానే ప్లాన్ చేసింది రాజమౌళి టీం.

ఈ క్రమంలో 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మార్చి 19న సాయంత్రం 6 గంటలకు కర్నాటకలోని చిక్బల్లాపూర్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఈవెంట్‌లో మూవీ ప్రమోషన్స్‌ కోసం ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి బ‌స‌వ‌రాజు బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కర్ణాటక సీఎంతోపాటు ఆరోగ్య శాఖ మంత్రి, సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌లు కూడా ముఖ్య అతిథులుగా రానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ వేడుకను దివంగత నటుడు పునీత్ రాజ్‌ కుమార్‌కు అంకితం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story