Ram Charan - Alia: మరోసారి సందడి చేయనున్న ఆర్ఆర్ఆర్ జోడీ?

Ram Charan - Alia: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రానున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'.

Venkata Chari
Published on: 21 May 2021 5:29 PM IST
RRR Pair Ram Charan and Alia Bhatt To Romance Again | Tollywood Latest Updates
X

రామ్ చరణ్, అలియా భట్ (ఫొటో ట్విట్టర్)

Ram Charan - Alia: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రానున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చెర్రీతో రొమాన్స్ చేయనున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అలరించనున్నారు.

అధిక బడ్జెట్ తో పాన్-ఇండియన్ ప్రాజెక్టుగా రానున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్ లో పనిచేయనున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో నటించబోతున్నారు.

తాజాగా ఈ సినిమాపై ఓవార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా మరోసారి అలియా భట్ కనిపించనుందంట. ఈమేరకు నిర్మాతలు ఆమెను సంప్రదించారంట. అయితే, ఇంతవరకు అలియా భట్ ఓకే చెప్పలేదని తెలుస్తోంది.

మరోవైపు, రామ్ చరణ్ 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చెర్రీ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిసిందే.

Venkata Chari

Venkata Chari

Next Story