'ఆర్‌ఆర్‌ఆర్' సీక్వెల్‌.. ఎన్టీఆర్ స్వయంగా అడగటంతో..

RRR Sequel: భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ని తిరగరాస్తోన్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌, ఫిక్షనల్‌ డ్రామా ఆర్‌ఆర్‌ఆర్‌.

Arun Chilukuri
Published on: 2 April 2022 1:04 PM IST
RRR Movie Writer KV Vijayendra Prasad on RRR Sequel
X

‘ఆర్‌ఆర్‌ఆర్’ సీక్వెల్‌.. ఎన్టీఆర్ స్వయంగా అడగటంతో..

RRR Sequel: భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ని తిరగరాస్తోన్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌, ఫిక్షనల్‌ డ్రామా ఆర్‌ఆర్‌ఆర్‌. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌, తారక్‌ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. "అర్ఆర్ఆర్" సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ట్రిపుల్ ఆర్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కథను విజయేంద్రప్రసాద్‌(రాజమౌళి తండ్రి) అందించాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌పై విజయేంద్ర ప్రసాద్‌ స్పందించారు.

ఓ ఇంటర్వ్యూలో తనకెదురైన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. 'ఓ రోజు ఎన్టీఆర్‌ మా ఇంటికి వచ్చి ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ గురించి అడిగాడు. నేను కొన్ని ఐడియాలను చెప్పాను. అవి ఎన్టీఆర్‌, రాజమౌళికి బాగా నచ్చాయి. దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో సీక్వెల్‌ రావొచ్చు'అని విజయేంద్రప్రసాద్‌ చెప్పుకొచ్చారు. ఇక మహేశ్‌బాబు సినిమాను రూ.800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారట కదా అని అడగ్గా.. ఇంకా కథే సిద్ధం చేయలేదు..అప్పుడే బడ్జెట్‌ ఎలా అంచానా వేస్తాం. అదంతా అబద్దమే. కథ సిద్ధం చేస్తున్నా'అని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story