RRR నుంచి మరో అప్డేట్!

RRR Movie Update : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR.. రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

Krishna
Published on: 11 Oct 2020 11:00 AM IST
RRR నుంచి మరో అప్డేట్!
X

RRR Movie 

RRR Movie Update : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR.. రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది.

తాజాగా సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను వదిలారు మేకర్స్. అశోక ధర్మ చక్రం, ముందు అల్లూరి, భీమ్ చేతులు కలిపినట్లు ఈ పోస్టర్ ఉంది. అయితే ఈ పోస్టర్ పైన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారిద్దరు కలిసిన సీన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ ని విడుదల చేయగా, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఈ నెల 22న విడుదల చేయనునట్టుగా చిత్రబృందం వెల్లడించింది.


ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ లతో పాటుగా బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది.

Krishna

Krishna

Next Story