ఆర్‌ఆర్‌ఆర్‌ టీజర్‌పై ఆదివాసీల మండిపాటు..సీన్లు మార్చకపోతే..

ఆర్‌ఆర్‌ఆర్‌ టీజర్‌పై ఆదివాసీల మండిపాటు..సీన్లు మార్చకపోతే..
x
Highlights

ఆదివాసీ వీరుల పోరాటాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న సినిమా అందులోనూ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌ అంటే ఆ సినిమాపై అభిమానుల అంచనాల గురించి...

ఆదివాసీ వీరుల పోరాటాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న సినిమా అందులోనూ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌ అంటే ఆ సినిమాపై అభిమానుల అంచనాల గురించి చెప్పనక్కర్లేదు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఇటీవలే సినిమా టీజర్‌ కూడా రిలీజ్ అయింది. రామరాజు ఫర్ భీమ్ పేరుతో విడుదలైన ఈ టీజర్‌ అభిమానుల అంచనాల్ని రెట్టింపు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడా టీజరే వివాదాస్పదమైంది.

తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథాంశాలతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టీజర్‌‌ వివాదం రేపుతోంది. టీజర్‌లో ఎన్టీఆర్‌ ముస్లిం గెటప్‌ ఈ వివాదానికి దారితీసింది. చరిత్రను వక్రీకరించొద్దంటూ కొందరు సూచిస్తుంటే మరికొందరు ముందే ఫిక్షనల్ అని చెప్పారుగా అంటూ రాజమౌళికి సపోర్ట్ చేస్తున్నారు. కొందరైతే ఆ గెటపే ఈ సినిమాకి ట్విస్ట్ అని అభిప్రాయపడుతున్నారు.

ఇక ఆదివాసీలైతే రాజమౌళిపై మండిపడుతున్నారు. చరిత్రను వక్రీకరించేలా కుమ్రంభీమ్‌ను కింఛపరిచేవిధంగా టీజర్ ఉందంటున్నారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం సైన్యానికి వణుకు పుట్డించిన యోధుడు కుమ్రంభీమ్‌. ఆదివాసీల హక్కులకోసం ప్రాణత్యాగం చేశారు. నిజాం పాలనపై తిరుగుబావుటా ఎగువేశాడు. అలాంటి మన్యం వీరుడి క్యారెక్టర్‌కి ఓ సామాజిక వర్గానికి సంబంధించిన టోపీ ఎలా పెడుతారని అదివాసీలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆ సన్నివేశాలను మార్చాలని లేదంటే కోర్టుకెళ్తామని ఆదివాసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories