RRR Movie Update: అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్న "ఆర్ఆర్ఆర్" చిత్రబృందం

* ఇప్పటిదాకా కనీవినీ ఎరుగని కొలాబోరేషన్ అంటున్నా "ఆర్ఆర్ఆర్" బృందం

admin1
Updated on: 28 Oct 2021 2:30 PM IST
RRR Movie Team Will Announce Big Update About the Movie Collaboration
X

అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్న "ఆర్ఆర్ఆర్" చిత్రబృందం

RRR Movie Update: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". బాహుబలి తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనుంది. తాజాగా ఈ చిత్ర దర్శక నిర్మాతలు సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ను విడుదల చేశారు. ఆ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరొక రెండు రోజుల్లో అనగా అక్టోబర్ 29న "ఆర్ఆర్ఆర్" కి సంబంధించిన ఒక అద్భుతమైన అప్డేట్ ని విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పటి దాకా ప్రపంచంలో ఎప్పుడు కనివినీ ఎరుగని అటువంటి ఒక షాకింగ్ కొలాబరేషన్ గురించి కూడా అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపింది చిత్రబృందం. మరి ఆ కొలాబరేషన్ ఎవరిది? ఆ సినిమా ఎలా ఉండబోతోంది? తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. మరోవైపు ఈ ఏడాది జూలైలో విడుదల కావాల్సిన "ఆర్ఆర్ఆర్" సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

admin1

admin1

Next Story