RRR Movie: నిప్పులో "రామ్".. నీటిలో "భీమ్".. రేపే "ఆర్‌ఆర్‌ఆర్" ట్రైలర్ రిలీజ్

* డిసెంబర్ 9న "ఆర్‌ఆర్‌ఆర్" ట్రైలర్ రిలీజ్

Sandeep Reddy
Updated on: 8 Dec 2021 12:29 PM IST
RRR Movie Team Released Brace Yourself for BHEEM and Brace Yourself for RAM Videos
X

RRR Movie: నిప్పులో "రామ్".. నీటిలో "భీమ్".. రేపే "ఆర్‌ఆర్‌ఆర్" ట్రైలర్ రిలీజ్

RRR Movie: ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం "ఆర్‌ఆర్‌ఆర్‌". ఈ సినిమాలో అల్లూరి పాత్రలో రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ కనిపించబోతున్నారు. అజయ్‌ దేవ్‌గన్, అలియా భట్, శ్రియా శరణ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. ఇప్పటికే రం చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల పోస్టర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

"బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్" అంటూ ట్రైలర్‌లో రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఒక సన్నివేశాన్ని కట్‌ చేసి రూపొందించిన వీడియోని మంగళవారం విడుదల చేశారు. పోలీస్‌ డ్రెస్‌ తో చెర్రీ మంటల్లోంచి నడుచుకురావడం ఈ వీడియోలో మనం చూడవచ్చు.

"బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్" అంటూ తాజాగా బుధవారం ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన ఒక సన్నివేశాన్ని కట్ చేసి ఎన్టీఆర్ నీటిలో ఉన్న ఒక వీడియోని విడుదల చేశారు. ఇక రామ్ చరణ్ నిప్పుల్లో.. ఎన్టీఆర్ నీటిలో కనిపిస్తూ తాజాగా విడుదలైన వీడియోలతో ట్రైలర్ డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story