Roar of RRR: "ఆర్ ఆర్ ఆర్" వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీలు

Roar of RRR: ముంబై లో జరగనున్న "రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్"

admin1
Published on: 18 Dec 2021 3:13 PM IST
RRR Movie Team is hosting this Event Roar of RRR | Tollywood News
X

"ఆర్ ఆర్ ఆర్" వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీలు(ఫైల్-ఫోటో)

Roar of RRR: భారీ అంచనాల మద్య "ఆర్ ఆర్ ఆర్" సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈనెల 19వ తారీఖున "రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్" అని ఒక ఈ ఈవెంట్ ని ముంబైలో ప్లాన్ చేసింది చిత్రబృందం.

అంతేకాకుండా ఈ వేడుకకి బాలీవుడ్లోని పలువురు సెలబ్రిటీలు కూడా విచ్చేయనున్నారు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరియు ప్రముఖ ఫిలింమేకర్ కరణ్ జోహార్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతథులుగా విచ్చేయనున్నారు.

సల్మాన్ మరియు మెగా ఫ్యామిలీ ల మధ్య ఉండే స్నేహం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తో కూడా సల్మాన్ ఖాన్ కి మంచి స్నేహం ఉంది. అందుకే ఈ చిత్ర ఈవెంట్ కోసం వెంటనే ఒప్పుకున్నారు సల్మాన్ ఖాన్. తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ లో కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తూ "Filter RRR Koffee With Karan" అని ఒక ఆసక్తికరమైన ఇంటర్వ్యూ అని కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్ భువమ్ భామ్ కూడా ఈ వేడుకలో స్టాండప్ కామెడీతో అందరి దృష్టిని ఆకర్షించనున్నారు.

admin1

admin1

Next Story