RRR Second Single: నవంబర్ 10న "ఆర్ఆర్ఆర్" రెండవ పాట

* రెండవ పాటకి సిద్ధమవుతున్న ఆర్ఆర్ఆర్ బృందం

admin1
Published on: 6 Nov 2021 6:01 PM IST
RRR Movie Second Single Release on 10 11 2021
X

ఆర్ఆర్ఆర్ (ట్విట్టర్ ఫోటో)

RRR Second Single: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక సినిమా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాకి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన అప్డేట్లను వదులుతూ, చిత్ర బృందం కూడా ఈ సినిమాపై ఆసక్తిని ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటుంది తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన మొట్టమొదటి సింగల్ కి అన్నీ భాషల్లోనూ మంచి రెస్పాన్స్ ఉంది.

తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండవ పాటను విడుదల చేసే సమయం వచ్చింది. ఇక ఈ సినిమాకి సంభందించిన రెండవ పాటని నవంబర్ 10 న రిలీజ్ చెయ్యడానికి సిద్దం అయ్యారు మూవీ యూనిట్. ఈ పాటలో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ డాన్స్ తో కేక పుట్టించారు అనే టాక్ ఫిలింనగర్ సర్కిల్స్ లో ఉంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన మొదటి పాట బ్లాక్ బస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. మరి రెండవ పాటతో దర్శక నిర్మాతలు ఇంకెంతగా మెప్పించనున్నారో తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story