RRR: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న "ఆర్‌ఆర్‌ఆర్" మూవీ "దోస్తీ" సాంగ్

RRR Movie Released Dosti Song And Trending in Youtube
x

"ఆర్‌ఆర్‌ఆర్" పోస్టర్(ట్విట్టర్ ఫోటో)

Highlights

Dosti Song: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సంగీత ప్రియుల ఎదురుచూపులకు సమాధానం చెబుతూ రామ్‌చరణ్‌-తారక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న "ఆర్‌ఆర్‌ఆర్" నుంచి...

Dosti Song: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సంగీత ప్రియుల ఎదురుచూపులకు సమాధానం చెబుతూ రామ్‌చరణ్‌-తారక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న "ఆర్‌ఆర్‌ఆర్" నుంచి "దోస్తీ" సాంగ్‌ వచ్చేసింది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం విడుదలైన ఈ పాట ప్రతి ఒక్కరిని ఎంతో ఆకట్టుకునేలా ఉంది. కీరవాణి సారథ్యంలో హేమచంద్ర (తెలుగు), అమిత్‌ త్రివేది (హిందీ), అనిరుధ్‌ (తమిళం), యాజిన్‌ నైజర్‌ (కన్నడ), విజయ్‌ ఏసుదాస్‌ (మలయాళం) ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు సంగీత యువ కెరటాలు ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు. "ఆర్‌ఆర్‌ఆర్"లో రామ్‌చరణ్‌-తారక్‌ల స్నేహానికి ప్రతీకగా ఈ పాటను రూపొందించినట్లు అర్థమవుతోంది.

"ఆర్‌ఆర్‌ఆర్" చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, రేయ్‌ స్టీవ్‌సన్‌, ఆలిసన్‌ డ్యూడీ, శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖనిలతోపాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే "ఆర్‌ఆర్‌ఆర్" ప్రమోషన్స్‌లో భాగంగా "దోస్తీ" పాటను విడుదల చేశారు. మరోవైపు ఇటీవల విడుదల చేసిన "ఆర్‌ఆర్‌ఆర్" మేకింగ్‌ వీడియోతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories