ఆ దేశంలో తక్కువ కలెక్షన్లు అందుకున్న "ఆర్ ఆర్ ఆర్"

RRR Movie Received Low Collections in that Country
x

ఆ దేశంలో తక్కువ కలెక్షన్లు అందుకున్న "ఆర్ ఆర్ ఆర్"

Highlights

*అంతంత మాత్రం గానే ఉన్న "ఆర్ఆర్ఆర్" కలెక్షన్లు

RRR Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా "ఆర్ఆర్ఆర్". భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ "బాహుబలి" సినిమాతో కంపేర్ చేస్తే మాత్రం "ఆర్ఆర్ఆర్" కలెక్షన్లు చాలా తక్కువ అని చెప్పుకోవాలి. నాన్ బాహుబలి రికార్డులలో ఆర్ఆర్ఆర్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాహుబలి స్థాయిలో లేవు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది. కానీ నైజాం వంటి ప్రాంతాల్లో మాత్రమే సినిమా భారీ ప్రాఫిట్ లను తీసుకు రాగలిగింది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం "ఆర్ఆర్ఆర్" సినిమా బయ్యర్లకు నష్టాలను కలుగజేసింది.

మరోవైపు కేరళ మరియు కర్ణాటకలో కూడా సినిమా కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అయితే తమిళనాడు మరియు నార్త్ ఇండియాలో సినిమా కలెక్షన్లు కేవలం బ్రేక్ ఈవెన్ పాయింట్ ను మాత్రమే చేరుకోగలిగాయి. అయితే ఓవర్సీస్ లో మాత్రం సినిమా కలెక్షన్లు భారీగానే ఉన్నాయి. అదే జోరుతో చిత్ర బృందం సినిమా ని జపాన్లో కూడా విడుదల చేసింది. కానీ జపాన్ లో మాత్రం సినిమా ఫ్లాప్ అయిందని చెప్పుకోవాలి. సినిమా కేవలం నాలుగు కోట్ల కలెక్షన్లను మాత్రమే నమోదు చేసుకోగలిగింది. ప్రస్తుతం చిత్ర బృందం సినిమాని చైనాలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. మరి చైనాలో సినిమా ఏ మేరకు కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories