యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీజర్‌

యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీజర్‌
x
Highlights

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'సినిమా కోసం...

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మహాబలేశ్వరం జరుగుతోంది. అయితే రీసెంట్ ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ యూ ట్యూబ్ లో రికార్డులను సొంతం చేసుకుంటుంది.

ఇప్పటి వరకు దాదాపు 3కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి 5లక్షల కామెంట్ల, 12 లక్షల లైకులు సాధించి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది ఈ టీజర్. ఈ రేంజ్‌లో కామెంట్లను దక్కించుకున్న తొలి టీజర్‌గా టాలీవుడ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. ఒక్క టీజ‌ర్ ఈ రేంజ్‌లో ర‌చ్చ చేయ‌డం చూస్తుంటే సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయం అని అంటున్నారు. అలియా భ‌ట్, ఒలీవియో మోరిస్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories