RRR: "ఆర్ ఆర్ ఆర్" తో దానయ్య కి మిగిలింది 25 కోట్లు ఏనా?

RRR: ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది...

Shireesha
Published on: 6 April 2022 2:07 PM IST
RRR Movie Profit to DVV Danayya | Tollywood News Today
X

RRR: "ఆర్ ఆర్ ఆర్" తో దానయ్య కి మిగిలింది 25 కోట్లు ఏనా?

RRR: అల్లూరి సీతారామరాజు పాత్ర లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కొమురంభీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన పాన్ ఇండియన్ సినిమా "అర్ ఆర్ ఆర్". భారీ అంచనాల మధ్య మార్చి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మించిన డి.వి.వి.దానయ్య రెమ్యూనరేషన్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ సినిమాని 450 కోట్ల బడ్జెట్తో నిర్మించిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందు నుంచే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఈ సినిమా బాగానే వసూలు చేసింది. ఈ చిత్ర థియేటరికల్ మరియు డిజిటల్ రైట్స్ ను డి.వి.వి.దానయ్య ఏకంగా ఏడు వందల కోట్లకు పైగానే అమ్మినట్లు తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం దానయ్య మాత్రం ఈ సినిమా కి వచ్చిన ప్రాఫిట్ లో కేవలం 25 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా డబ్బులు సినిమా బడ్జెట్ కోసం తీసుకున్న అప్పు లకు వాడాల్సి వచ్చిందని తెలుస్తోంది. మరోవైపు సినిమాకి వచ్చిన ప్రాఫిట్ లలో చాలా వరకు రాజమౌళి కుటుంబం తీసుకుందని పుకారు కూడా వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

Shireesha

Shireesha

Next Story