"ఆర్ఆర్ఆర్" ఓటీటీ లో అప్పుడే విడుదల అవుతుందట...

RRR OTT Release: అనుకున్న విధంగానే బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది..

Shireesha
Published on: 26 March 2022 1:22 PM IST
RRR Movie OTT Release will be After June | SS Rajamouli | Ram Charan | Jr NTR
X

"ఆర్ఆర్ఆర్" ఓటీటీ లో అప్పుడే విడుదల అవుతుందట...

RRR OTT Release: ప్రపంచవ్యాప్తంగా గా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన "ఆర్ఆర్ఆర్" సినిమా ఎట్టకేలకు మార్చి 25 థియేటర్లలో విడుదలైంది. అనుకున్న విధంగానే బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. "బాహుబలి 2" తో రికార్డులు సృష్టించిన రాజమౌళి మళ్లీ "ఆర్ఆర్ఆర్" సినిమాతో తన రికార్డును తానే తిరగరాసుకుంటున్నారు.

ఏ థియేటర్ చూసినా అభిమానుల హంగామా తో పండగ వాతావరణం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల హవా బాగానే కనిపిస్తోంది. అయితే లాక్‌డౌన్‌ పుణ్యమా అని ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు బాగానే డిమాండ్ పెరిగింది. థియేటర్ లో విడుదలైన నెలరోజుల కే సినిమాలు ఓటీటీ లో విడుదల కు సిద్ధమవుతున్నాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం "ఆర్ఆర్ఆర్" సినిమా అని మాత్రం అంత తొందరగా ఓటీటీ లో విడుదల చేసేది లేదని తెలుస్తోంది. "ఆర్ఆర్ఆర్" సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో జూన్ తర్వాత మాత్రమే విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జి5 వారు ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వర్షన్లను భారీ రేటుకు కొనుగోలు చేశారు. హిందీ వెర్షన్ ను మాత్రం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

Shireesha

Shireesha

Next Story