RRR Movie: "ఆర్ఆర్ఆర్" ఓటీటీ విడుదల తేదీ ఖరారు

RRR Movie OTT Release Date Finalized | Telugu Movie News
x

RRR Movie: "ఆర్ఆర్ఆర్" ఓటీటీ విడుదల తేదీ ఖరారు

Highlights

RRR Movie: "ఆర్ఆర్ఆర్" ఓటీటీ విడుదల తేదీ ఖరారు

RRR Movie: అల్లూరి సీతారామరాజు పాత్ర లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించిన "ఆర్ఆర్ఆర్" సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 25న థియేటర్లలో విడుదలైంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారింది. బాహుబలి2 కలెక్షన్ లను సైతం బ్రేక్ చేస్తూ ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్న ఈ చిత్రం రిలీజ్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

చిత్ర డిజిటల్ రైట్స్ ను జీ 5 మరియు నెట్ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని థియేటర్లలో విడుదలైన రెండు నెలల కు అంటే మే 25 న ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. చిత్ర హిందీ డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ వారు కొనుగోలు చేయగా మిగతా భాషల్లో సినిమా రైట్స్ ను జీ 5 వారు కొనుగోలు చేశారు. అజయ్ దేవగన్, సముతిరఖని, రాహుల్ రామకృష్ణ, శ్రీయ, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories