కొమరం భీమ్ గా తారక్..నెట్టింట రికార్డుల పరుగులు!

Arun Chilukuri
Updated on: 22 Oct 2020 4:48 PM IST
కొమరం భీమ్ గా తారక్..నెట్టింట రికార్డుల పరుగులు!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కి దసరా గిఫ్ట్ ఇచ్చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తారక్ టీజర్ రానే వచ్చింది. అంచనాలను మరింత పెంచేలా టీజర్ ఉండటంతో, త్రిబుల్ ఆర్‌ పై ఎక్స్‌పెక్టేషన్స్ భారం మరింత పెరిగేలా ఉందంటున్నారు.

దసరా కానుకగా వచ్చిన త్రిబుల్ ఆర్ కొత్త టీజర్ అనుకున్నట్టే వాటర్ బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చింది. అల్లూరి సీతారామరాజు టీజర్‌ని నిప్పుతో, కొమురం భీం టీజర్‌ని నీటితో ప్లాన్ చేసిన జక్కన్న, విజువల్ ట్రీట్ ఇచ్చాడంటున్నారు. ఐదు భాషల్లో రిలీజ్ చేసిన టీజర్లకు జనం ఫిదా అవుతున్నారు. ఈ టీజర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించాడు. ఈ చిత్రంలో లో కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇంతకు ముందు విడుదల అయినటువంటి రామ్ చరణ్ లుక్ టీజర్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం విశేషం. ఈ టీజర్ విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో రికార్డుల దుమ్ము దులుపుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story