Naatu Naatu Song Promo: "నాటు నాటు" పాటకి ఊర మాస్ డాన్స్ తో చరణ్, ఎన్టీఆర్

Naatu Naatu Song Promo: తాజాగా "ఆర్ఆర్ఆర్" చిత్రం నుండి నాటు నాటు సాంగ్ ప్రోమో విడుదల చేసిన మేకర్స్

Sandeep Reddy
Updated on: 9 Nov 2021 12:17 PM IST
SS Rajamouli Announces the Naatu Naatu Song Will Release  on 10th November 2021 From RRR Movie
X

Naatu Naatu Song Promo: "నాటు నాటు" పాటకి ఊర మాస్ డాన్స్ తో చరణ్, ఎన్టీఆర్

Naatu Naatu Song Promo: రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న "ఆర్ఆర్ఆర్" (RRR) చిత్రం నుండి తాజాగా రెండో సింగిల్ సాంగ్ ప్రోమో విడుదలైంది. నా పాట సూడు..నా పాట సూడు..నాటు నాటు..వీర నాటు..ఊర నాటు అంటూ సాగే ఈ పాటలో టాలీవుడ్ టాప్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో డాన్స్ చేయడం నిజంగా అభిమానులకు కన్నుల పండుగే అని చెప్పొచ్చు. ఈ పాటకు ఎంఎం కీరవాణి తన సంగీతాన్ని అందించగా చంద్రబోసు లిరిక్స్ అందించాడు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని ఆలపించారు.

ఈ పాటని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలో ఫుల్ సాంగ్ ని నవంబర్ 10 న(బుధవారం) చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ తో పాటు అలియా భట్, శ్రియ శరన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఈ పాట ప్రోమో సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక "ఆర్ఆర్ఆర్" నుండి ఇప్పటికే విడుదలైన దోస్తీ పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story