'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఎన్టీఆర్ బాబాయ్‌గా!

ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ బాబాయ్‌గా!
x
Highlights

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని అనౌన్స్ చేసిన అప్పటి నుంచి ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే...

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని అనౌన్స్ చేసిన అప్పటి నుంచి ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ప్రెస్మీట్లో రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన చాలానే వివరాలను బయట పెట్టారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. అంతేకాక ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రకని కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే తాజాగా సముద్రకని పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమాలో సముద్రకని ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో కనిపించబోతున్నారట. అంటే సముద్రకని కొమరం భీమ్ పాత్రకు బాబాయ్ గా ఈ సినిమాలో దర్శనమివ్వనున్నారు. నిజానికి బ్రిటిష్ వారి పైన మొదట ఎదురు తిరిగింది ఆయనే. ఆ తర్వాతే ఎన్టీఆర్ కొమరం భీం గా రంగంలోకి దిగుతాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తోంది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కోసం ఇంకా వెతుకుతున్నారు దర్శకనిర్మాతలు. డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.






Show Full Article
Print Article
Next Story
More Stories