RRR Movie: "ఆర్ఆర్ఆర్" విడుదలకి మరో అడ్డంకి

RRR Movie: "ఆర్ఆర్ఆర్" మార్చ్ లో కూడా విడుదల అవ్వదా?

admin1
Updated on: 26 Jan 2022 12:26 PM IST
RRR Movie is Likely to be Postponed to April 28th | Telugu Movie News
X

"ఆర్ఆర్ఆర్" విడుదలకి మరో అడ్డంకి

RRR Movie: ఈ ఏడాది జనవరి 7న "ఆర్ ఆర్ ఆర్" సినిమా విడుదల అవుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా కోవిడ్ కారణంగా దర్శక నిర్మాతలు ఈ చిత్రం విడుదల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మార్చి 18 లేదా ఏప్రిల్ 28న సినిమా విడుదల అవుతుందని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈ రెండు తేదీలలో మార్చిలో సినిమా విడుదల చేయడానికి ఒక పెద్ద చిక్కే వచ్చిపడింది. భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక మిగతా భారతీయ భాషల్లో కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే కన్నడలో ఈ సినిమాని మార్చి 18న విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదు.

దానికి కారణం కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ ఆఖరి సినిమా "జేమ్స్" ను విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఆ వారం మొత్తం కేవలం పునీత్ రాజ్ కుమార్ సినిమాకే అంకితం ఇవ్వాలని మార్చ్ 17 నుంచి 23 దాకా మారే సినిమా విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా థియేటర్లన్నీ పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పించనున్నాయి. కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు మరియు అభిమానుల మనోభావాలను దెబ్బతీయకుండా "ఆర్ ఆర్ ఆర్" సినిమా ను ఏప్రిల్ 28న కి వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

admin1

admin1

Next Story