ఆగని 'ఆర్ఆర్ఆర్‌' కలెక్షన్లు.. రూ. 1100 కోట్ల క్లబ్బులో ఆర్ఆర్ఆర్..

ఆగని 'ఆర్ఆర్ఆర్‌' కలెక్షన్లు.. రూ. 1100 కోట్ల క్లబ్బులో ఆర్ఆర్ఆర్..

Arun Chilukuri
Updated on: 22 April 2022 8:30 PM IST
RRR Movie Grosses Rs 1,100 Crore Worldwide
X

ఆగని 'ఆర్ఆర్ఆర్‌' కలెక్షన్లు.. రూ. 1100 కోట్ల క్లబ్బులో ఆర్ఆర్ఆర్..

RRR Box Office Collections: అల్లూరి సీతారామరాజు పాత్ర లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ హీరోలుగా నటించిన "ఆర్ ఆర్ ఆర్" సినిమా రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూ ఈ సినిమా థియేటర్లలో ఇంకా సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదలై 4 వారాలు గడిచింది. కానీ ఇంకా కలెక్షన్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మనదేశంలో ఈ సినిమాని పెన్ స్టూడియోస్ వారు డిస్ట్రిబ్యూట్ చేశారు.

తాజాగా పెన్ స్టూడియోస్ బృందం చిత్ర కలెక్షన్లు గురించిన ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. "ఆర్ ఆర్ ఆర్" సినిమా "ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసుకుని "ఆర్ ఆర్ ఆర్" ఇంకా థియేటర్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. విజయవంతంగా 5వ వారంలో అడుగుపెట్టింది" అని ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు పెన్ స్టూడియోస్ వారు. ఒకవైపు "కేజిఎఫ్" సినిమా కూడా థియేటర్లలో బాగానే సందడి చేస్తుండగా "ఆర్ ఆర్ ఆర్" మాత్రం ఇంకా అదే జోరు కనబరుస్తోంది. అలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ లు హీరోయిన్లుగా నటించే ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియా శరణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story