Vishwak Sen: విశ్వక్ సేన్ సినిమా కోసం "ఆర్ఆర్ఆర్" స్టంట్ డైరెక్టర్లు

Vishwak Sen: ఈ మధ్యనే "అశోక వనంలో అర్జున కళ్యాణం" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు విశ్వక్ సేన్.

Arun Chilukuri
Published on: 3 Sept 2022 2:22 PM IST
RRR Movie Fight Masters For Vishwak Sen Das Ka Dhamki Movie
X

Vishwak Sen: విశ్వక్ సేన్ సినిమా కోసం "ఆర్ఆర్ఆర్" స్టంట్ డైరెక్టర్లు

Vishwak Sen: ఈ మధ్యనే "అశోక వనంలో అర్జున కళ్యాణం" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు విశ్వక్ సేన్. తాజాగా ఇప్పుడు దాస్‌కా 'దమ్కీ' అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు విశ్వక్. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ సినిమాకి చాలా కీలకంగా మారబోతుందని, ఈ ఒక్క సన్నివేశం కోసం భారీ సెట్ ను సైతం వేశారని తెలుస్తోంది. బల్గేరియాకు చెందిన స్టంట్ డైరెక్టర్లు తోడోర్ లజరావ్ మరియు జుజి డ్యో ఈ సినిమా కోసం స్టంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు.

తెలుగులో ఇది వీరికి మూడవ సినిమా. గతంలో "ఆర్ఆర్ఆర్" సినిమాకి అద్భుతమైన స్టంట్లు అందించిన వీరిద్దరూ తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "హరిహర వీరమల్లు" సినిమాలో కూడా భారీ స్టంట్ సన్నివేశాన్ని తెరకెకిస్తున్నారు. తాజాగా ఇప్పుడు విశ్వక్ సేన్ "దస్ కా దమ్" సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశానికి కూడా ఒక అదిరిపోయి యాక్షన్ బ్లాక్ సిద్ధం చేస్తున్నారు వీరిద్దరు.

క్లైమాక్స్ కోసం మాత్రమే కాకుండా సినిమాలోని మరికొన్ని యాక్షన్స్ సన్నివేశాలను కూడా రామకృష్ణ మరియు వెంకట్ మాస్టర్ల ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దీపావళి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విశ్వక్ సేన్ స్వయంగా ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. వన్మయి క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నివేత పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story