RRR - Bheemla Nayak: పవన్ తో పోటీ వద్దు.."ఆర్ఆర్ఆర్" కోసం రంగంలోకి రాజమౌళి..!!

* "ఆర్ఆర్ఆర్" కోసం "భీమ్లా నాయక్" విడుదల తేదీని మార్చుకోవాలని పవన్ కి కోరనున్న రాజమౌళి..!?

Sandeep Reddy
Published on: 23 Nov 2021 2:01 PM IST
RRR Movie Director Rajamouli Requested to Postpone Pawan Kalyan Bheemla Nayak Movie Release From Sankranthi 2022
X

పవన్ కళ్యాణ్ - రాజమౌళి(ఫైల్ ఫోటో)

Pawan Kalyan - Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న "ఆర్ఆర్ఆర్" చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధానపాత్రల్లో నటించిన "భీమ్లా నాయక్" చిత్రం కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో "ఆర్ఆర్ఆర్" చిత్ర నిర్మాతలతో పాటు దర్శకుడు రాజమౌళి కాస్త టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే పలుమార్లు "భీమ్లా నాయక్" సినిమా నిర్మాతలతో మాట్లాడిన విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండకపోవడంతో ఇక పవన్ కళ్యాణ్ తో డైరెక్ట్ గా మాట్లాడటానికి దర్శకుడు రాజమౌళి రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మార్కెట్ తో పాటు "భీమ్లా నాయక్" జనవరి 12న విడుదలైతే "ఆర్ఆర్ఆర్" కు థియేటర్స్ సమస్యతో పాటు కలెక్షన్స్ లోనూ కొంత వెనుకబడే ఛాన్స్ ఉండటంతో పవన్ కళ్యాణ్ తో పోటీవద్దనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

మరోపక్క "ఆర్ఆర్ఆర్" సినిమా ప్రమోషన్ కోసం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం కలుస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. మరి "భీమ్లా నాయక్" గా సంక్రాంతి బరిలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అటు అబ్బాయి రామ్ చరణ్ కోసమో, దర్శకుడు రాజమౌళి కోసమో, లేదా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన "ఆర్ఆర్ఆర్" కోసమైనా పోటీ నుండి తప్పుకొని ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని నిరూపిస్తాడో వేచి చూడాల్సిందే.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story