RRR Movie Update: 'ఆర్‌ఆర్‌ఆర్‌' అభిమానుల‌కు బిగ్ న్యూస్

Samba Siva Rao
Updated on: 19 Jan 2021 6:02 PM IST
RRR Movie Update
X

RRRమూవీ 

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ .యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో భారీ మల్టీస్టారర్ సినిమా 'ఆర్‌ఆర్ఆర్' చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ అప్‌డేట్స్ కోసం ప్రేక్ష‌కులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‌అయితే తాజాగా ఆర్‌ఆర్ఆర్ నుంచి ఓ మంచి అప్డేట్ వచ్చింది. ఆర్‌ఆర్ఆర్ భారీ క్లైమాక్స్ షూట్ ప్రారంభమైందని చిత్ర యూనిట్ తెలిపింది. భీమ్, రామరాజు కలిసి వారు సాధించాలనుకున్నది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపింది. ఈమేరకు ఇద్దరి చేతులను కలిపి ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. క్లైమాక్స్ షూట్ కావడంతో ఇదే చివరి షెడ్యూల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా అలియాభట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ సందడి చేయనున్న విషయం తెలిసిందే. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story